శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (10:24 IST)

శ్రీశైలంలో చిరుతపులి సంచారం

శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్‎లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రింగ్ రోడ్ సమీపంలో ఉన్న చెట్ల పొదలలో ఆవును చంపి చిరుతపులి రక్తం తాగింది.

చిరుత దాడిలో ఆవు మృతి చెందడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే రింగ్ రోడ్ వద్దకు చేరుకున్న అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి..ఆవు మృతి సోమవారం రాత్రి జరిగినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అడవిలోవున్న ఆవు మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు దహనం చేశారు.

ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చిరుత కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.