శ్రీశైలంలో రేపటి నుంచి దసర మహోత్సవాలు

srisailam temple
ఎం| Last Updated: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:00 IST)
శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జునస్వామి దేవాలయంలో రేపటి నుంచి దసర మహోత్సవాలు మొదలుకానున్నాయి. ఉదయం 8:30 గంటలకు యాగశాల ప్రవేశంతో దసర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

రేపటి నుంచి 25 వరకు ఆలయంలో ఆర్జిత, హోమాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. దసరా నవరాత్రులలో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేసినట్లు చెప్పారు.

కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహింపబడుతుందని తెలిపారు. శ్రీశైలం ఆలయంలో‌ స్వామి అమ్మవార్లు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలలో రోజుకొక్క అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఈవో వెల్లడించారు.
దీనిపై మరింత చదవండి :