శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ వరద
భారీ వరద వస్తుండంతో శ్రీశైలం క్రెస్ట్ గేట్లు మళ్లీ ఎత్తారు. సాయంత్రానికి నాగార్జున సాగర్, దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు తలుపులు తెరిచే అవకాశం ఉంది.
సాగర్ జలాశయంలో 7 టిఎంసీల ఖాళీ ఉండగా మళ్లీ పూర్తి స్థాయికి చేరింది. కృష్ణా నదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు వరదనీటితో ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుందని హెచ్చరించడంతో ఇన్ ఫ్లో కంటే ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ రిజర్వాయర్ కు 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా మిడ్ మానేరు డ్యాంకు వరద కాల్వ ద్వారా 12,857 క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ కు 6,000 విడుద చేస్తున్నారు.
సరస్వతి కెనాల్, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు పంపింగ్ చేస్తున్నారు. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజికి 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.