శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (08:36 IST)

శ్రీశైలం డ్యాంకు పోటెత్తిన వరద

ఎగువ రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు.

పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 856 అడుగుల వద్ద 94.68 టీఎంసీల నిల్వలు నమోదు అయ్యాయి. ఆదివారం సాయంత్రానికి 94 టీఎంసీల నీరు  నిల్వ ఉంది.

పైన ఉన్న జూరాలకు 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 28 గేట్లు ఎత్తి 2,23,948 క్యూసెక్కులను శ్రీశైలం, పరిసర కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇందులో 2,13,486 క్యూసెక్కులు డ్యాంకు చేరుతున్నాయి.