గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (08:24 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం

ఒడిసా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అది రాత్రికి ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా 5.8కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్త నం కొనసాగుతోంది. మధ్య తమిళనాడు పరిసరాల్లో 7.6కి.మీ. ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది.

వీటి ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో భారీవర్షా లు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. విజయనగరంలో 123, నెల్లిమర్ల 60, వంగరలో 58 మి.మీ. వర్షపాతం నమోదైంది.

సోమవారం ఉత్తరాంధ్ర, యానాంలలో భారీవర్షాలు కురుస్తాయని, రాయలసీమలోనూ అక్కడక్కడ భారీవర్షాలకు అవకాశం ఉంది. రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.