23న దక్షిణకోస్తాంధ్ర మీదగా అల్పపీడనం
ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం మరియు ఈ నెల 23న దక్షిణకోస్తాంధ్ర మీదగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు,కడప,కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు దృష్ట్యా విపత్తుల శాఖ కమీషనర్ కె.కన్నబాబు గారు వర్షప్రభావ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు కుడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.