ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:32 IST)

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి

కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలానికి 2,11,543 క్యూసెక్కుల వరద నీరు చేరింది.

ఆరు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 1,66,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.20 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 215 టిఎంసి లకుగాను ప్రస్తుతం 210.9946 టిఎంసిలు గా నమోదైంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పొటెత్తుతుంది. మరోవైపు ఎగువ నుండి కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 309.6546 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,54,878 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.20 అడుగుల మేరకు నీటి మట్టం ఉంది.