గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (11:24 IST)

నాగార్జునసాగర్ కు తగ్గుతున్న వరద..ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు

మూడు రోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు ప్రాజెక్ట్  8 గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 1,54,886 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  1,54,486 క్యూసెక్కులుగా ఉంది.

అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ  312.0405 ఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 305.5646 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 587.00 అడుగులకు చేరింది. వరద తగ్గుతుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 44.0352 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 173.882 అడుగులకు చేరింది. 
 
తేలికపాటి వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు.