శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (14:00 IST)

884.70 అడుగులకు చేరిన శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,53,607 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  1,14,542 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులకు చేరింది. 

పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.8824 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.