మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పేర్ని నాని
మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు.
ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అక్రమాలకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేస్తామని… గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు.
సంస్కరణలకు కేబినెట్ ఆమోదం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సమయం కుదించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు 5 రోజుల ప్రచార సమయమివ్వడానికి అంగీకరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజుల ప్రచార సమయమిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సమయం కుదించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు 5 రోజుల ప్రచార సమయమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజుల ప్రచార సమయమివ్వడానికి అంగీకరించింది. సర్పంచి స్థానికంగానే ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు సర్పంచికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రకృతి వైపరీత్యాలు, నీటిఎద్దడి వచ్చినప్పుడు సర్పంచి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్ని నాని వివరించారు.