బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:18 IST)

ఓడినా చంద్రబాబులో మార్పు రాలేదు: మంత్రి పేర్నినాని

ఎన్నికల్లో ప్రజలు ఓడించినా చంద్రబాబులో మార్పు రాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. ఈరోజిక్కడ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. అభివృద్ధికి చంద్రబాబే చాంపియన్‌ అయితే ప్రజలు ఎందుకు ఉతికి ఆరేశారు? అని ప్రశ్నించారు.

ప్రజల మనోభావాలు చంద్రబాబుకు తన జీవిత కాలంలో అర్థం కావన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ పాలిస్తున్నారన్నారు. ఏపీ రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మరోమారు విమర్శలు చేశారు.

రాజధాని అమరావతి పెద్ద వివాదంగా మారిందని అన్నారు. రాజధానిగా అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానుల్లో ఒకటిగా దీనిని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎక్కడైనా ఒకచోటే రాజధాని ఏర్పాటు చేయాలని, మూడు ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, మినీ సచివాలయం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ సబబుగానే ఉంది కానీ, మూడు ముక్కలుగా పాలన చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.