1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మే 2024 (13:31 IST)

ఎన్నికల తర్వాత లండన్‌కు వెళ్లిపోనున్న జగన్ దంపతులు?

jagan
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విదేశాలు, ముఖ్యంగా లండన్ వెళ్లడం కొత్తేమీ కాదు. అక్కడ ఉన్నత చదువులు చదువుతున్న తన కూతుళ్లను కలవడానికి అతను తరచూ లండన్ వెళ్లేవారు. తాజాగా 
 
సోషల్ మీడియాలో తాజా కథనాల ప్రకారం.. మే 13న పోలింగ్ ముగిసిన వెంటనే జగన్, ఆయన భార్య భారతి లండన్ వెళ్లనున్నారు. 
 
ఈ క్రమంలో జగన్, భారతి మే 15న లండన్ వెళ్లి 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. అక్కడ తన ఇద్దరు కూతుళ్లతో ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేసే అవకాశం ఉంది. జూన్ 4న జరిగే కౌంటింగ్‌కు 4 రోజుల ముందు జగన్ తిరిగి రానున్నారు. 
 
ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన జరిగే బిగ్ డి-డేకి ముందు ఆయన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలను బట్టి రెండోసారి సీఎం కావచ్చు లేదా మళ్లీ ప్రతిపక్ష నేతగా మారవచ్చు.