1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (15:29 IST)

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్షాలు

andhra pradesh map
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఏపీ తీరానికి చేరువగా అల్పపీడనం రానుంది. దీని ప్రభావం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ వెల్లడించారు. 
 
దీని ప్రభావం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అప్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది బుధవారం నాటికి ఏపీ తీరానికి చేరుకోవచ్చని పేర్కొంది. 
 
దీని ప్రభావం కారణంగా కోస్తాంధ్రలో పలు చోట్ల రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాదులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యుకారులు మూడు రోజుల పాటు వేటకు దూరంగా ఉండాలని సూచన చేసింది.