Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమి ఉపరితలంపై కూడా అల్పపీడం ఏర్పడే ఛాన్స్.. వాతావరణ శాఖ

Written By ఠాగూర్
Updated: గురువారం, 8 ఆగస్టు 2024 (10:16 IST)
సాధారణంగా సముద్రంలో  అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. కానీ, గురువారం మాత్రం విచిత్రంగా భూమిపై కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి ఐదు రోజుల క్రితం వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ఫలితంగా మధ్య, ఉత్తర, వాయవ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయి.
 
తాజాగా ఇప్పుడు తూర్పు, మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. బుధ ఉదయం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి జార్ఖండ్, ఉత్తర ఒరిస్సా, చత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. గుురవారం ఉదయానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 
 
ఈ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఓ మోస్తరుగా కదులుతున్నందున నిన్న అనేక చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 

అన్నీ చూడండి

అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్ తో మరోసారి థియేటర్లలో సందడి.

Geethu Mohandas: టాక్సిక్ బెంగళూరు స్క్రీనింగ్‌లో గీతూ మోహన్‌దాస్ కన్నీళ్లు - మరో చిత్రానికి రెడీ

GV Narayana Rao: సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూత - ఇండస్ట్రీ సంతాపం

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments