సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (09:20 IST)

పవర్ లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు : తేల్చేసిన సీఎస్ ఎల్వీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రే.. కానీ ఆయన అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం నిమియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం తేల్చిపారేశారు. పైగా, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి తనను ఎలాంటి సమీక్షలకు ఆహ్వానించలేదని ఆయన చెప్పారు. 
 
ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే. కానీ, ఆయనకు రెగ్యులర్ ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు ఉండవు. పైగా, ఆయన ఇష్టానుసారంగా సమీక్షలు చేయడానికి వీల్లేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. 
 
అంటే సాంకేతికంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదనీ, వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రేనని కానీ పవర్ లేని ముఖ్యమంత్రి అని తేల్చిచెప్పారు. అదేసమయంలో మే నెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు గెలిస్తే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనీ, వైకాపా అధినేత జగన్ గెలిస్తే మంచి మంచి ముహూర్తం చూసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పారు. 
 
ఎన్నికల నియమావళి ఉన్న సమయంలోనే అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఏం చేయాలి? అపుడు కూడా ముఖ్యమంత్రి ఏమీ చేయకూడదా? అని ప్రశ్నించగా అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నియమావళికి లోబడి అధికార యంత్రాంగానికి సూచనలు చేయవచ్చని అదికూడా ప్రాపర్ చానల్‌లో చేయాలని చెప్పారు. ఇక్కడ ప్రాపర్‌ చానల్‌ అంటే... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (తానే) అని కూడా ఎల్వీ వివరణ ఇచ్చారు.