శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (10:46 IST)

విద్య మంచి సమాజానికి పునాది... ప‌ది మందిని చ‌దివించండి

ఉన్నతంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కనీసం 10 మంది పేద విద్యార్థులను ఆదుకోవాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. కొట్టి నంద ప్రవీణ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ కొట్టి స్వర్ణకుమారి  "విద్య సేవ ట్రస్ట్ "ఆధ్వర్యంలో మచిలీపట్నం ప్రభుత్వ  లేడీ యంఫ్తుల్ బాలికల కళాశాలలో 20 వేల ఖరీదు చేసే ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన విద్య సేవ ట్రస్ట్ కన్వీనర్ బాలాజీ మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలుగా ఈ కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థినిలకు యూనిఫామలు, ఫీజులు చెల్లిస్తూ వితరణ చాటుతున్నందుకు అభినంద‌న‌లు తెలిపారు. విద్య ఉన్నత స్థితికి వెళ్ళడానికి పునాది రాళ్లు అని, ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి కేంద్రీకరించి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. 
 
విశ్రాంత ఉపాధ్యాయులు నాగరాజు మాట్లాడుతూ విద్యాదానం అన్నింటికంటే గొప్పది అని, ముఖ్యంగా ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు సహకరించడం అభినందనీయమన్నారు. చలువాది కోటేశ్వరరావు(ఎల్.ఐ. సి) తన తల్లిదండ్రుల పేరుమీద ఐదుగురు విద్యార్థులకు దుస్తులు అందజేశారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన వారికి ఆరువేల రూపాయలు తన తల్లి తండ్రి పేరున క్యాష్ అవార్డులు ప్రకటించారు. విద్యార్థులకు బాలాజీ ఏక రూప దుస్తులను, మాస్క్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రేపల్లి రాంబాబు,మున్నవర్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.