మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:33 IST)

మహారాష్ట్ర ఎన్నికలు : శివసేనకు మూడో స్థానం .. నోటాకు రెండో స్థానం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా, లాతూర్ గ్రామీణ అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరజ్‌ పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు 135006 ఓట్లు పోలయ్యాయి. 
 
ఆ తర్వాత స్థానంలో నోటా గుర్తుకు ఏకగా 27500 ఓట్లు వచ్చాయి. ఇదే స్థానంలో పోటీ చేసిన శివసేన పార్టీ అభ్యర్థి సచిన్ దేశ్‌ముఖ్‌కు కేవలం 13459 ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కంటే నోటా గుర్తుకు అధిక ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. పైగా, లాతూర్‌ (గ్రామీణ) స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.