శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (11:14 IST)

వితంతు మహిళపై భర్త అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన భర్త

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వితంతు మహిళకు అత్యాచారం జరిగింది. వితంతు మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతుంటే.. అతని భార్య ఆ తతంగాన్ని రికార్డు తీసింది. సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను రిక

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వితంతు మహిళకు అత్యాచారం జరిగింది. వితంతు మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతుంటే.. అతని భార్య ఆ తతంగాన్ని రికార్డు తీసింది. సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను రికార్డుచేసి ఆమెను శారీరకంగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం పట్టణంలోని పరికముక్కల కాలనీకి చెందిన ఓ వితంతువు ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తోంది. దుకాణ అవసరాల నిమిత్తం ఆమె పోలీస్ కాలనీలో నివసిస్తోన్న వ్యాపారి సత్యనారాయణ ఇంటికి వెళ్తుండేది. అలా ఆ కుటుంబంతో ఏర్పడిన పరిచయంతో ఓ ఫంక్షన్‌కు హాజరైంది. అయితే ఆమెకు సత్యనారాయణ మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో ఉండగా.. ఆమెపై సత్యనారాయణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను అత్యాచారం చేస్తోంటే అతడి భార్య వసంత సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. ఈ వీడియోను అడ్డుపెట్టుకొని సత్యనారాయణ ఆమెను తరచూ శారీరకంగా వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక భాదితురాలు ఖానాపురం హావేలీ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.