ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (13:26 IST)

మంగళగిరిలో ఆరని ఇళ్ల చిచ్చు...

మంగళగిరిలో చెలరేగిన ఇళ్ళ చిచ్చు ఇంకా ఆరలేదు. దీంతో మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవి నివాసం వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దీనిపై గంజి చిరంజీవి మాట్లాడుతూ, రాజకీయ దురుద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే తమపై విమర్శలు చేస్తున్నారనీ ఆరోపించారు. పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అసలు విషయం తెలుసుకున్న తర్వాతే మాట్లాడలంటూ హితవు పలికారు. 
 
అవినీతి గత ప్రభుత్వ హయాంలో జరిగిందని, ఆ ప్రభుత్వ హయాంలోనే ఇళ్లు నిర్మించిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారని చిరంజీవి అన్నారు. మంగళగిరి పట్టణంలోని అందరికీ న్యాయం చేయాలన్నదే తమ ధ్యేయమన్నారు. అవినీతి జరిగిందని నిరుపణ చేయండి, ఇది మీ ప్రభుత్వం, ఏదైనా చేయవచ్చు అంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. 
 
మీ ప్రభుత్వంలోనైనా మంగళగిరికి మంచి జరిగితే అంతే చాలన్నారు. కక్ష్య సాధింపు చర్యలు కాకుండా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ పూర్తి అవగాహన చేసుకొని ప్రజలకు మేలు చేయాలని చిరంజీవి కోరారు. డీడీ రూపంలో చెల్లించింది ప్రభుత్వంకు మాత్రమే, అందులో సూమారు 300 మాత్రం ఎక్కువ చెల్లింపు చేశారన్నారు.
 
2500 వరకు ఇళ్ళకు మంజూరు చేసిన విషయం మరిచిపోయినట్టున్నారని తెలిపారు. కమిటి నిబంధనలకు లోబడే ఇళ్ళకు సంతకాలు చేశారు. దానిలో కేవలం స్థానిక ఎమ్మెల్యే ఆర్కే సంతకం తప్ప మిగిలిన అందరు నిబంధనలకు అనుగుణంగానే చేశారు. తనపై చేసిన ఆరోపణలను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
తెలుగుదేశం పార్టీ పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకోరదన్నారు. అవసరమైతే ఆందోళనలు, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశం మాని ప్రజల కోసం పనిచేయండి. మీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలల కాలంలో ఏమి చేశారని ప్రశ్నించారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నలిగిపోతున్న లబ్దిదారులు. తము కట్టిన నగదు ఎవరిని అడిగి తెలుసుకోవాలో చెప్పాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.