శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (10:58 IST)

రోజూ ఇంటికి వచ్చే పాము.. అర్థరాత్రి నగ్నంగా మహిళ పూజలు..

సాంకేతికత ఎంత పెరిగినా మూఢనమ్మకాలపై జనాలకు నమ్మకం ఏమాత్రం తరగట్లేదు. గుప్త నిధి లభిస్తుందని ఓ నకిలీ బాబా చెప్పిన మాయమాటలకు ఓ మహిళ మోసపోయింది. అంతేకాకుండా.. అర్థరాత్రి పూట నగ్న పూజలు చేసింది. ఈ ఘటన మంత

సాంకేతికత ఎంత పెరిగినా మూఢనమ్మకాలపై జనాలకు నమ్మకం ఏమాత్రం తరగట్లేదు. గుప్త నిధి లభిస్తుందని ఓ నకిలీ బాబా చెప్పిన మాయమాటలకు ఓ మహిళ మోసపోయింది. అంతేకాకుండా.. అర్థరాత్రి పూట నగ్న పూజలు చేసింది. ఈ ఘటన మంత్రాలయంలోని మాధవరంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మాధవరంకు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంటికి తరచూ పాము వచ్చేది. ఈ విషయాన్ని ఓ స్వామీజి చెప్పడంతో.. అతడు ఇంటిని పరిశీలించి.. పూజలు చేయాలన్నాడు. ఆ మహిళ కూడా నమ్మి మోసపోయింది. 
 
ఇందుకోసం రూ.30వేలు వరకు ఖర్చు చేసింది. ఓ రోజు అర్థరాత్రి పూట స్వామి చెప్పినట్లు నగ్నంగా పూజలు చేసింది. కానీ పాము ఆమె ఇంటికి రావడం ఆగలేదు. ఆరు నెలలైనా గుప్త నిధులు దొరకలేదు. చివరికి బాబా మోసం చేశాడని గమనించి.. అతనితో ఆ మహిళ గొడవకు దిగింది. 
 
తాను ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. ఇవ్వకపోవడంతో నడిరోడ్డుపైనే చొక్కా పట్టుకుని నిలదీసింది. ఈ క్రమంలో ఆ బాబాపై ఆ మహిళ దాడికి దిగింది. సదరు బాబాను కొట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.