శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (17:11 IST)

పదివేల రూపాయలకు 3 నెలల పసికందును అమ్మేసింది.. ఎక్కడ?

పదివేల రూపాయలకు తన కడుపున పుట్టిన బిడ్డను ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌కి చెందిన పైడాల పద్మ(25) రోజువారీ కూలీగా జీవన

పదివేల రూపాయలకు తన కడుపున పుట్టిన బిడ్డను ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌కి చెందిన పైడాల పద్మ(25) రోజువారీ కూలీగా జీవనం సాగిస్తోంది. ఆమె భర్త బాలరాజు.. కొద్ది రోజుల క్రితం ఆమెను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయాడు. ఆమెకు మూడు నెలల పసికందు ఉన్నాడు. 
 
కాగా.. తనను వదిలి వెళ్లిపోయిన భర్త కోసం గాలిస్తుండగానే.. పద్మకి యాక్సిడెంట్ జరిగింది. దీంతో బిడ్డ పోషణ కష్టతరంగా మారింది. కూలీ పనికి వెళ్దామనుకుంటే.. బిడ్డను ఎవరూ చూసుకోలేని పరిస్థితి. దీంతో చేసేది లేక కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఇందులో భాగంగా 
 
బాలాపూర్‌లోని రాజీవ్ గృహకల్పలో పనిచేసే కుమారి లక్ష్మమ్మ అనే మహిళకు తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. రూ.10వేలకు ఆ మగబిడ్డను కొనుగోలు చేసేందుకు అంగీకరించిన ఆమె.. అడ్వాన్స్ గా రూ.4,500 ఇచ్చింది. 
 
కానీ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బిడ్డ తల్లిని, కొనుగోలు చేసిన మహిళలను ఇద్దరినీ అరెస్టు చేశారు. బిడ్డను ఇవ్వాలనుకుంటే చట్టపరంగా ఇవ్వాలని పోలీసులు సూచించారు. అక్రమంగా బిడ్డను అమ్మడం అన్యాయమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.