శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:22 IST)

కాకినాడలో మిగ్‌ యుద్ధ విమానం

కాకినాడ సాగరతీరంలో మిగ్‌ యుద్ధ విమానం సందర్శకులకు కనువిందు చేయనుంది. టీయూ 142 మిగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బీచ్‌పార్కులో ఏర్పాటు చేసేందుకు మంత్రి కురసాల కన్నబాబు చర్యలు చేపట్టారు.

బీచ్‌లో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) రూ.5.89 కోట్ల నిధులతో మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే తమిళనాడులోని అరక్కోణం ఐఎన్‌ఎస్‌ రాజాలి నావెల్‌ ఎయిర్‌స్టేషన్‌ నుంచి టర్న్‌బొప్రోప్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ టీయూ 142 ఎం.. విడి భాగాలు కాకినాడ బీచ్‌కు భారీ వాహనాల్లో తరలివచ్చాయి.

తెనేజా ఏరో స్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ కెప్టెన్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో యుద్ధవిమాన పరికరాలను ఒకచోటకు చేర్చి యుద్ధ విమానాన్ని రూపొందించారు. త్వరలో ఇది సందర్శకులకు కనువిందు చేయనుంది. ఈనెలాఖరులో పూర్తిస్థాయిలో యుద్ధ విమానాన్ని తయారు చేసి మ్యూజియంలో ప్రవేశపెట్టేలా నేవీ అధికారులు శ్రమిస్తున్నారు.