శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:15 IST)

తిరుపతి నుంచి హైదరాబాదుకు ఏసీ, స్లీపర్‌ బస్సులు

తిరుపతి నుంచి హైదరాబాదుకు ఈనెల 21 నుంచి అమరావతి ఏసీ, వెన్నెల స్లీపర్‌ బస్సులను నడపనున్నారు. దీనిపై డిప్యూటీ సీటీఎం మధుసూదన్‌ అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి 8.30గంటలకు అమరావతి ఏసీ బస్సును, 9.15 గంటలకు వెన్నెలస్లీపర్‌ సర్వీసును అందుబాటులోకి తేనున్నామన్నారు.

అవసరమైన ప్రయాణికులు తమ టికెట్లను బస్టాండులోని రిజర్వేషన్‌ కౌంటర్‌తోపాటు ఏటీబీ ఏజెంట్ల వద్ద, తమ వెబ్‌సైట్‌ ద్వారా కానీ రిజర్వు చేసుకోవచ్చన్నారు. 48 గంటల ముందు రిజర్వు చేసుకునే ప్రయాణికులకు 10శాతం సీట్ల వరకు టికెట్‌ ధరలో పది శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు.

ఈ రాయితీ తిరుపతి నుంచి హైదరాబాదు, విజయవాడ, వైజాగ్‌, బెంగళూరు, అనంతపురం, కర్నూలు ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా వర్తిస్తాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి, మంగళం డిపో మేనేజర్లు ప్రవీణ్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.