శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:08 IST)

నేటి నుంచి తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఓపీ సేవలు

ఈ నెల 17వ తేది నుంచి తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌  తెలిపారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తిరిగి గైనిక్‌, ఇన్‌ఫర్టిలిటీ, మోనోపాజ్‌ క్లీనిక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న ప్రసూతి విభాగంలో ఎక్కువగా రద్దీ ఉండటం వలన దానిని తగ్గించడానికి ప్రసూతి వైద్య భవనం నుంచి స్ర్తీ వైద్య విభాగం సేవలు మరో భవనంలోకి మార్చడం జరిగిందన్నారు.

సంతాన లేమితో బాధపడుతున్న దంపతులకు ప్రతి రోజూ స్ర్తీ వైద్య విభాగంలో ఓపీ సేవలు, చికిత్స అందిస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా సంతాన సాఫల్య కేంద్రం నుంచి ప్రతి బుధవారం, శనివారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.