గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (20:11 IST)

'బర్డ్'లో ఓపి సేవలు ప్రారంభం

తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపి సేవలు పునఃప్రారంభించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎం.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.

కోవిడ్-19 జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ రోజుకు 50 మందికి ఓపి సేవలు అందిస్తున్నామని ఆయన వివ‌రించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు.

అత్యవసర కేసులు అడ్మిట్ చేసుకుంటున్నామని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.