ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (15:26 IST)

బంగారు బాతులాంటి అమరావతి నిర్వీర్యం : సినీ నటి దివ్యవాణి

బంగారు బాతులాంటి అమరావతిని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి ఆరోపించింది. పైగా, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ, బంగారుబాతు వంటి అమరావతిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అమరావతిని నాశనం చేయొద్దంటూ అసెంబ్లీలో రెండు చేతులు జోడించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వేడుకున్నారని గుర్తుచేశారు.
 
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పంచాయతీ భవనాలకు వేసిన వైకాపా జెండా రంగుల నుంచి రాజధాని వరకు అన్ని నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయని దివ్యవాణి ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు న్యాయస్థానాలే న్యాయం చేస్తాయని ఆమె తెలిపారు. స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో వాస్తవాలు బహిర్గతం చేయకుండా రమేశ్ బాబుపై కక్షసాధింపులు తగవని దివ్యవాణి పేర్కొన్నారు.