ఏపీ సర్కారుపై విరుచుక పడ్డ చంద్రబాబు, ప్రధాని మోదీకి లేఖ

chandrababu
వి| Last Modified సోమవారం, 17 ఆగస్టు 2020 (15:28 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ మొత్తం మూడు పేజీల లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు రాసారు. ఫోన్ టాపింగ్ కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దాంతో ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాజకీయ నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను టాపింగ్ చేయడంతో దేశ భద్రతకే ప్రమాదమని తెలిపారు. ఇలాంటి చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్చకు భంగం కలిగిస్తాయని లేఖలో తెలిపారు.

పాలనను ఆటవిక రాజ్యం వైపు తీసుకోపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార వైసీపీ ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ల ట్యాపింగ్ లాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :