గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

విజయవాడ ఇఎస్ఎ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఓపి సేవలు

విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓపీ సేవలు విజయవాడలోని ఇఎస్ఎ ఆసుపత్రికి మార్చామని జిల్లా కలెక్టర్ ఏ.యండి ఇంతియాజ్ అన్నారు.

గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కొవిడ్-19గా ఆసుపత్రిగా గుర్తింపబడి కొవిడ్ వైద్య సేవలు అందిస్తున్నందున్న, గవర్నమెంట్ డాక్టర్లు ఓపి కేసులకు సంబంధించి ఇఎస్ఐ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.

అత్యవసర ఆపరేషన్లు, అత్యవసర వైద్యాన్ని, ఓపి సేవలను ఇకనుండి ఇఎస్ఐ ఆసుపత్రి నుండి నిర్వహిస్తారని కలెక్టర్ అన్నారు.

ఆనారోగ్యం ఉన్నవారు ఓపి సేవలు పొందగోరె ప్రజలు ఇఎస్ఐ ఆసుపత్రికి వెళ్ళాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.