శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (21:09 IST)

విజయవాడలో రైతు బజార్ల వికేంద్రీకరణ

విజయవాడ నగరంలోని 5 ప్రధాన రైతు బజార్లను 28 ప్రాంతాలకు వికేంద్రీకరించిన్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు 5 ప్రధాన రైతు బజార్లను ఆయా ప్రాంతాలకు విస్తరించడం జరిగిందారు.

భవానిపురం బజార్ పరిధిలో(4) బొబ్బూరి గ్రౌండ్స్, విద్యాధరపురం,ఆర్టీసీ డిపో,లారీ స్టాండ్, గొల్లపూడి హైస్కూల్లో. కె. డి.పేట రైతు బజార్ పరిధిలో(6) కెబిఎన్ కాలేజ్, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్,జిo ఖానా గ్రౌండ్స్,సత్యనారాయణ పురంలోని ఏ కెటిపీఎం స్కూల్,రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే గ్రౌండ్స్ లోను,స్వరాజ్ మైదానం పరిధిలో (9)సిద్దార్థ డిగ్రీ కాలేజీ,

లయోల కాలేజ్ గ్రౌండ్స్,బిషప్ గ్రేషి హైస్కూల్,పొట్టి శ్రీరాములు జూనియర్ కాలేజ్, సిద్ధార్థ మహిళ కళాశాల, వజ్ర గ్రౌండ్ ఎ1 కన్వెన్షన్, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం,ఎస్ ఎస్ ఆర్,సివిఆర్ కాలేజ్, గుణదాల టూ నున్న రోడ్ లోని డేప్ అండ్ డoబ్ స్కూల్, పాయకపురం,అజిత్ సింగ్ నగర్ రైతు బజార్ పరిధిలో(2) బసవపున్నయ్య స్టేడియం,ఎం కె బైగ్ స్కూల్, పటమట రైతు బజార్ పరిధిలో(7) ఏపిఐఐసి కాలనీ ఓపెన్ సైట్,ఎన్ఎస్ యం పబ్లిక్ స్కూల్,

నిర్మల కాన్వెంట్ హైస్కూల్,మారిస్ స్టెల్లా కాలేజ్, సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజ్, కానూరు,యనమలకుదురు పంచాయతీ ఆఫీస్, ఎన్టీఆర్ సర్కిల్లోని కృష్ణవేణి స్కూల్ ఆవరణలో ప్రత్యేక రైతు బజార్ల నిర్వహించబడతాయి.