1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:52 IST)

గ్రీన్ జోన్ లోకి కాకినాడ

కాకినాడ  గ్రీన్ జోన్ లోకి వచ్చింది. కరోనా ఫ్రీ సిటీగా కాకినాడను డిక్లేర్ చేశారు. కాకినాడ బ్యాంక్ పేటలోని ఇరువురు పాజిటివ్ రోగులు వైరస్ నుండి కోలుకొని  డిశ్చార్జి అయ్యారు. 28 రోజులుగా బ్యాంక్ పేటలో అదనంగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్  ఎత్తివేశారు.

దీంతో కాకినాడ సిటీని గ్రీన్ జోన్ ప్రకటించారు. ఇక కాకినాడను గ్రీన్ జోన్ గా ప్రకటించడంపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ జోన్ లోకి రావడానికి  సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

గ్రీన్ జోన్ వచ్చినప్పటికీ ప్రజలంతా మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ జోన్ లోకి నగరం రావడంతో నిబంధనలలో కొంత మేరకు సడలింపు ఉంటాయని అంటున్నారు.