శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:10 IST)

గ్రీన్ జోన్‌లో దుకాణాలు తెరిచేందుకు అనుమతి: కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక రాష్ట్రంలో గ్రీన్, ఆరంజ్ జోన్లు అయిన 22 జిల్లాల్లో బుధవారం నుంచి దుకాణాలు, పరిశ్రమలను పునర్ ప్రారంభించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బెంగళూరు, మైసూర్‌తో పాటు 8 రెడ్ జోన్ జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గ్రీన్, ఆరంజ్ జోన్ జిల్లాల్లో దుకాణాలు, పరిశ్రమలు పునర్ ప్రారంభించాలని నిర్ణయించారు.

గ్రీన్ జోన్ జిల్లాల్లోని చామరాజనగర్, హాసన్, చిత్రదుర్గ, కోలార్, చిక్కామంగళూరు, దావణగెరె, హవేరీ, కొడగు, కొప్పాల్, రామనగర, రాయచూర్, శివమొగ్గ, ఉడుపి, యాదగిర్, ఆరంజ్ జిల్లాలైన బళ్లారి, మాండ్యా, బెంగళూరు రూరల్, గడగ్, తూముకూరు, చిక్కాబళ్లాపూర్, ఉత్తరకన్నడ, థార్వాడ్ జిల్లాల్లో దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.

అయితే హోటళ్లు, మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, స్కూళ్లు, పాఠశాలలను మాత్రం మూసివేశారు. నగర శివార్లలోని దుకాణాలను తెరచి ఉంచాలని నిర్ణయించారు.