మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:02 IST)

లాక్ డౌన్ నుంచి పలు షాపులకు మినహాయింపు

లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్‌ రిచార్జ్‌, సిమెంట్‌, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పించింది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవుని తెలిపింది.
 
ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు.

గ్రామీణ ఆర్ఠిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారులను నియమిస్తామని తెలిపారు.
వీటికే మినహాయింపులు..
 
పుస్తకాలు, స్టేషనరీ షాపులు, నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ షాపులు, మొబైల్‌ రిచార్జ్‌ షాపులు, ఆటా కంపెనీలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత, ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్‌ దుకాణాలు, సిమెంట్‌ విక్రయాలకు అనుమతి. పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు.