శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:54 IST)

ఎల్లుండి నుంచి అమెరికాలో లాక్‌డౌన్‌ సడలింపు?

కరోనా మరణాలు బెంబేలెత్తిస్తున్నా అమెరికా తగ్గనంటోంది. ఎల్లుండి నుంచి లాక్ డౌన్ సడలింపుకు సిద్ధమవుతోంది. జార్జియా రాష్ట్రంలో శుక్రవారం నుండి జిమ్‌లు, హెయిర్‌ సెలూన్‌ వంటి చిరు వ్యాపారాలను పున్ణప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ బ్రియాన్‌ కెంప్‌ ప్రకటించారు.

వ్యాపారాలు పునరుద్ధరించినా, భౌతిక దూరం నిబంధన పాటించాలని ఆయన సూచించారు. జార్జియా బాటలోనే సౌత్‌ కరోలినా, టెన్నెస్సీ, ఇలినాయిస్‌, లూసియానా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.

వ్యాపారాలు పున్ణప్రారంభమైతే రాష్ట్రం అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుంటుందన్నారు. కరోనా మహమ్మారి అత్యంత వేగంగా దేశాన్ని కమ్ము కుంటున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ల సడలింపునకు సిద్ధం కావటంపై వైట్‌హౌస్‌ వైద్యాధికారి డా.ఆంథోనీ ఫౌసి లాక్‌డౌన్‌ల తొలగింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

తొందరపాటుతో వ్యవహరిస్తే ఎదురు తిరిగే ప్రమాదం వుందని హెచ్చరించారు. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ తాజా లెక్కల ప్రకారం అమెరికా దేశవ్యాప్తంగా కరోనా కేసులు సోమవారం నాటికి 7,84,000 దాటగా మరణాల సంఖ్య 42 వేలు దాటినట్లు తెలుస్తోంది.

ఈ మహమ్మారికి కేంద్ర స్థానంగా వున్న న్యూయార్క్‌ రాష్ట్రంలో 2,53,000 కేసులు, 18 వేల మరణాలు నమోదయినట్లు తెలుస్తోంది.