మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (10:53 IST)

కరోనా ఎఫెక్ట్.. విజయవాడ, నెల్లూరుజిల్లాలో మాంసపు దుకాణాలు బంద్

కరోనా పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ నిబంధనలు కఠినం చేస్తున్నారు. ఇప్పటికే రెడ్ జోన్ ఏరియాలను గుర్తించి నిబంధనలు కఠినం చేశారు.

తాజాగా విజయవాడలో కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఒక్క విజయవాడలోనే 120కి పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

ఇప్పటికే కరోనా వ్యాపించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను మూసేసింది. మిగతా రోజులతో పోలిస్తే ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే, ఉదయం కొద్దిసేపు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది నాన్ వెజ్ షాపులకు వస్తుంటారు. దీంతో అక్కడ సామాజిక దూరం పాటించడం కష్టం అవుతుంది.

గుంపులు గుంపులుగా ఉన్న సమయంలో జరగరానిది ఏదైనా జరిగితే... ఇక కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఆదివారం రోజున ఏపీలో ముఖ్యంగా విజయవాడలో షాపులు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
 
నెల్లూరు జిల్లాలో..
చికెన్, మటన్ షాపులన్నింటినీ పోలీసులు మూసివేయించారు. ఆదివారాల్లో మాంసం దుకాణాల ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇలా జనం గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

దీంతో జిల్లాలోని అన్ని చికెన్, మటన్ షాపలను మూసివేయించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72కు చేరింది. రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీసులు నిబంధనలను కఠినతరం చేశారు.