1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:48 IST)

చర్మకారుల అభివృధ్ధి కోసం ప్రత్యేక ప్యాకేజి: రావెల

ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా చర్మకారి వృత్తిలో పని చేస్తున్న సుమారు 25 వేలమంది కార్మికులు గత 45 రోజులుగా వృత్తి నిర్వహణ లేక రోజువారీ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న ప్రతి చర్మకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రివర్యులు, బిజెపి నాయకులు రావెల కిషోర్ బాబు కోరారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక కార్పొరేట్ సంస్థలు పోటీపడి మాదిగల కులవృత్తి పై పడిందని ప్రపంచంలో అతి పెద్దవైన బాటా, షోలపూర్,కరోనా,రిలయన్స్ ,మొచి అనే సంస్థలు ఆధిపత్యం మద్య అసలైన చర్మకారుల నష్టపోతూ ప్రాణాలను సైతం పోగొట్టుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పట్లో సంయుక్త ఆంద్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పుడు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్మకారుల కోసం ఒక ప్రత్యేక సంస్థ "లిడ్ క్యాబ్"సంస్థ చెప్పులు షాప్ లు ఏర్పాటుకు సుమారు 50 వేలనుంది ఒక లక్ష రూపాయలు వరకు పూచీకత్తు లేని రుణాలు మంజూరు చేసేవని కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా వేరుపడ్డాక ఆసంస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచ మానవాళి ఉనికికే ప్రమాదం గా మారిన ఈ కరోనా వైరస్ కారణం గా లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న చర్మకారులకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారిని ఆదుకోవాలని  ప్రధాన డిమాండ్ తో చర్మకారి వృత్తుల వారికి మద్దతుగా ప్రపంచ కార్మిక దినోత్సవం " మేడే " సందర్భంగా  ఈరోజు ఈ దీక్ష చేపట్టానని తెలిపారు. 

తక్షణం చర్మకారుల ఆకలి బాధలు తీర్చి సహాయం చేయాలని. దీనిపై ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్మకారుల ఆర్థిక స్వాలంబాణకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారిని ఆదుకోవాలని కిషోర్ బాబు తెలిపారు.