బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (16:02 IST)

చేతులు కట్టేసి పోరాడమంటే ఎలా?: పవన్‌కు ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్న

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. కొందరు ఎంపీలు పదవులు అనుభవిస్తూనే.. వ్యాపారాలు చేసుకుంటున్నారని.. పోలవరం పాటు ప్రజా సమస్యలను

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. కొందరు ఎంపీలు పదవులు అనుభవిస్తూనే.. వ్యాపారాలు చేసుకుంటున్నారని.. పోలవరం పాటు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని పవన్ చేసిన కామెంట్లపై గల్లా జయదేవ్ ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చారు. తాము చేయాల్సిందంతా చేశామని.. చేతులు కట్టేసి పోరాడమంటే ఎలాగని ప్రశ్నించారు.
 
ఎంపీగా తాను అందుబాటులో వుంటానని.. తాను అందుబాటులో వుండనని వస్తున్న వార్తలన్నీ ప్రచారమేనని చెప్పారు. 2019 ఎన్నికల్లో విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు తనకు పోటీగా దిగుతాడని భావిస్తున్నానని, గెలుపుకోసం శాయశక్తులా పోరాడతానని వెల్లడించారు. 2012 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన చిరంజీవి, రాజ్యసభకు వెళ్లిన తరువాత కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి తాను విఫలమయ్యానని, ఆపై సరైన పార్టీలో సరైన చోటు నుంచి స్థానాన్ని కోరుకుని తెలుగుదేశంలో చేరానని గల్లా జయదేవ్ తెలిపారు.
 
ఇకపోతే.. 2019 ఎన్నికల్లో తన గెలుపు కష్టసాధ్యమైనా మహేష్ బాబు ప్రచారానికి పిలవనని తెలిపారు. గత ఎన్నికల్లో మహేష్ రాకుండానే గెలవడం మంచిదనిపిస్తోందని తెలిపారు. తెలుగువారే అయినప్పటికీ తెలుగులో మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది పడుతారు? అనే ప్రశ్నకు సమాధానంగా, తన తెలుగు భాషా సామర్థ్యం గుంటూరు ప్రజలను అడిగితే తెలుస్తుందని బదులిచ్చారు.