Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మోహన్ బాబు - స్టాలిన్‌కు ఉన్న లింక్ తెలిస్తే షాకే... రజినీ ఫ్యాన్స్ గుర్రుగా...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణానంతరం డిఎంకే బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు స్టాలిన్‌కు – మన డైలాగ్‌కింగ్‌ మోహన్‌ బాబుకు మధ్య ప్రత్యేక అనుబంధం ఏమైనా ఉందా? ఎందరో ప్రముఖులుండగా కరుణానిధి సంస్మరణ సభకు మోహన్‌ బాబునే ఎందుకు పిలిచినట్లు? ‘మిమ్మల్ని

Written By TJ
Updated: మంగళవారం, 28 ఆగస్టు 2018 (22:09 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణానంతరం డిఎంకే బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు స్టాలిన్‌కు – మన డైలాగ్‌కింగ్‌ మోహన్‌ బాబుకు మధ్య ప్రత్యేక అనుబంధం ఏమైనా ఉందా? ఎందరో ప్రముఖులుండగా కరుణానిధి సంస్మరణ సభకు మోహన్‌ బాబునే ఎందుకు పిలిచినట్లు? ‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా’ అని స్టాలిన్‌ను ఉద్ధేశించి మోహన్‌ బాబు ఎందుకు వ్యాఖ్యానించినట్లు?
 
ఈ ఆదివారం నాడు కోయంబత్తూరులో జరిగిన కరుణానిధి సంస్మరణ సభకు మోహన్‌ బాబును ఆహ్వానించారు స్టాలిన్‌. స్టాలిన్‌తో కలిసి వున్న ఫొటోను మోహన్‌బాబు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మోహన్‌బాబు-స్టాలిన్‌ భేటీ గురించి చర్చించే ముందు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గురించి మాట్లాడుకోవాలి. త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించ బోతున్నట్లు రజనీకాంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిఎంకే, అన్నాడిఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగానే ఆయన పార్టీ ప్రారంభిస్తున్నారు.
 
రజనీకాంత్‌, మోహన్‌బాబు ప్రాణమిత్రులు అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మోహన్‌బాబును స్టాలిన్‌ ఆహ్వానించడంపై ఆసక్తి నెలకొంది. రజనీతో పొత్తు, అవగాహన వంటి అంశాలపై మోహన్‌ బాబుతో ఏమైనా చర్చించారా? స్టాలిన్‌ సిఎం కావాలని మోహన్‌బాబు ఆకాంక్షిస్తే… మరి ప్రాణమిత్రుడైన రజనీ సంగతి ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొంతకాలం ఆగాల్సిందే. కాగా మోహన్ బాబు అలా స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆకాంక్షించడంపై రజినీ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఏమయినా మాట్లాడుతారేమో చూడాలి.

అన్నీ చూడండి

Medha: శ్రీకాంత్, ఊహల తనయ హీరోయిన్ కాబోతోందట..

Ranbir Kapoor : రామాయణ పార్ట్ 1 కు అడ్వాన్స్ బుకింగ్స్.. IMAX ఫార్మాట్‌లోనూ విడుదల

RT78 : మాస్ మహారాజా రవితేజ క్రైమ్ ను కూడా తులాభారం తో కొలుస్తున్నాడా !

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

తర్వాతి కథనం
Show comments