శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (20:32 IST)

సోమవారం అమరావతి రైతుల మహాపాదయాత్రకు సెలవు

అమరావతి రైతుల మహాపాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది. కార్తీక సోమవారం కావటంతో పాదయాత్రకు సెలవు ప్రకాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పాదయాత్ర జన ప్రభంజనంలా ముందుకు సాగుతోంది. 
 
యాత్ర శనివారంతో ఆరో రోజుకు చేరింది. పాదయాత్రకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
 
ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.