ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (16:01 IST)

4న తెలంగాణాలో వ్యాక్సిన్ హాలిడే

దీపావళి పండుగను పురస్కరించుకుని నేడు (నవంబరు 4)న వ్యాక్సిన్ హాలిడేను ప్రకటించింది. దీంతో గురువారంనాడు కోవిడ్ వాక్సినేషన్ ఇస్తున్న వైద్య సిబ్బంది విరామం దొరికింది. అయితే ఎల్లుండి (నవంబర్ 5) శుక్రవారం నుంచి మళ్ళీ యధావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందిగా పదేపదే హెచ్చరిస్తూ వస్తోంది. 
 
మరోవైపు, దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీచేస్తూనేవుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేసింది. 
 
కోవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో ప్రజలను చైతన్య పరిచేలా ప్రభుతం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా చేస్తున్న సర్కార్.. ఇక ఇంటింటికి వ్యాక్సిన్ ను ఇస్తున్న సంగతి తేలిందే.