1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (19:03 IST)

అమరావతి రైతుల మహా పాదయాత్రకు నీరాజనాలు పలకండి: సిపిఐ శ్రేణులకు రామకృష్ణ పిలుపు

నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సిపిఐ శ్రేణులు ఘన స్వాగతం పలికి, పాదయాత్రలో పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు.
 
ఈ మేరకు కె రామకృష్ణ మేరకు నేదోక ప్రకటన విడుదల చేశారు. "అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతుల 45 రోజుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా జరుగుతుంది. రైతుల పాదయాత్ర ఆయా జిల్లాలలోకి ప్రవేశించినప్పుడు సిపిఐ తరపున ఘనస్వాగతం పలికి, పార్టీ శ్రేణులు తప్పక పాదయాత్రలో పాల్గొనాలి.

సిపిఐ నియోజకవర్గ నాయకత్వం, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రకు స్వాగతం పలికి, నియోజకవర్గం వరకు తప్పక పాల్గొనాలి. తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం.

రైతుల మహాపాదయాత్రతోనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం"  అని ఆయన పేర్కొన్నారు.