మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (12:16 IST)

నల్గొండలో దారుణం... భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. చితక్కొట్టింది..

నల్గొండ జిల్లాలో మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఇంతకీ ఆమె ఏం నేరం చేసిందంటే.. వేరొక మహిళ భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతే తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంటుందంటూ స్తంభానికి కట

నల్గొండ జిల్లాలో మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఇంతకీ ఆమె ఏం నేరం చేసిందంటే.. వేరొక మహిళ భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతే తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంటుందంటూ స్తంభానికి కట్టేసింది. ఆమెతో పాటు బంధువులు ఆమెపై తీవ్రంగా దాడి చేశారు.  ఈ ఘటనలో బాధితురాలికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన ముత్యాలమ్మ అనే మహిళ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమసంబంధం నెరపిందనే అనుమానంతో వ్యక్తి భార్య రేణుక సోమవారం తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టింది. 
 
అయితే గ్రామస్థులు అక్కడకు చేరుకోవడంతో రేణుక, ఆమె బంధువులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళ కట్టు విప్పేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.