సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (16:00 IST)

దేవాలయంలోనే అత్యాచారం.. కత్తులతో దాడి.. సజీవదహనం.. ఎక్కడ?

దేవాలయంలోనే ఘోరం జరిగింది. 25ఏళ్ల మహిళపై ఆలయంలోనే కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. యువతిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అత్యంత కిరాతకంగా కత్తులతో దాడిచేసి, ఆ తర

దేవాలయంలోనే ఘోరం జరిగింది. 25ఏళ్ల మహిళపై ఆలయంలోనే కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. యువతిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అత్యంత కిరాతకంగా కత్తులతో దాడిచేసి, ఆ తర్వాత సజీవంగా దహనం చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు సమీపంలో వెంకయ్య స్వామి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో వున్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లతో ఆధారాలను సేకరించారు. ఇలా సేకరించిన ఆధారాలతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు, ఈ హత్య ఎలా జరిగిందో వివరించారు. 
 
బాధితురాలిని వెంకయ్య స్వామి గుడి వద్దకు తీసుకువచ్చిన నిందితులు మొదట మద్యం సేవించి, ఆ తర్వాత గుడి పరిసరాల్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెప్పారు. ఆపై కత్తులతో దాడి చేయగా, ఆమె పారిపోయేందుకు యత్నించి వుంటుందని.. దీంతో ఆమెను సజీవదహనం చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.