శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (18:08 IST)

ఆమె కోసం రోడ్డు మీద కొట్టుకున్న ఇద్దరు 'మొగుళ్లు'... మూడోవాడితో వెళ్లిపోయింది...

ఇప్పుడు ఇలాంటి ఘటనలు అక్కడక్కడా గోచరిస్తున్నాయి. ఇంతకీ ఏమిటా సంఘటనలు... అంటారా? ఇదిగో ఇదే. బెంగళూరులోని నేలమంగల జాతీయ రహదారిపై 38 ఏళ్ల మహిళ రోడ్డు మీద నిలబడి వుండగా ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ముష్ఠిఘాతాలు ఇచ్చుకుంటున్నారు. కిందాపైనా పడుతూ కుమ్మాయిపోట

ఇప్పుడు ఇలాంటి ఘటనలు అక్కడక్కడా గోచరిస్తున్నాయి. ఇంతకీ ఏమిటా సంఘటనలు... అంటారా? ఇదిగో ఇదే. బెంగళూరులోని నేలమంగల జాతీయ రహదారిపై 38 ఏళ్ల మహిళ రోడ్డు మీద నిలబడి వుండగా ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ముష్ఠిఘాతాలు ఇచ్చుకుంటున్నారు. కిందాపైనా పడుతూ కుమ్మాయిపోట్లు పొడుచుకుంటున్నారు. అలా వారు కొట్టుకోవడాన్ని చూసిన వాహనచోదకుల్లో కొందరు వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ వారేమాత్రం పట్టించుకోలేదు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆ ఇద్దరు వ్యక్తులు తన భార్యను తీసుకెళ్తున్నాడంటే తన భార్యను తీస్కెళ్తున్నాడంటూ వివరించారు. ఈ క్రమంలో అసలు విషయం ఏంటా అని ఆరా తీసిన పోలీసులు షాక్ తిన్నారు.
 
అదేమిటంటే... శశికళ అనే పేరుగల ఈ 38 ఏళ్ల మహిళకు తొలుత రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ఇద్దరి భర్తలకు విడాకులు ఇచ్చేసింది. తర్వాత మూడోవాడైన మూర్తితో సన్నిహితంగా వుంటూ అతడితో సహజీవనం చేస్తోంది. ఐతే మూర్తికి అంతకుముందే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఇది తెలిసిన శశికళ క్రమంగా అతడికి దూరం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సిద్దరాజు అనే క్యాబ్ డ్రైవర్ పరిచయమయ్యాడు. 
 
అతడు పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చాడు. పైగా అతడు ఆమెను పెళ్లాడుతానంటూ ప్రపోజ్ చేశాడు. అతడికి కారు కూడా వుండటంతో ఆమెకు బాగా కలిసి వచ్చింది. జాలీగా అతడి కారులో తిరుగుతూ వుండటంతో ఇది గమనించిన మూర్తి సమయం కోసం వేచి చూశాడు. బస్టాండులో శశికళ-సిద్ధరాజు కనబడటంతో ఒక్కసారిగా సిద్ధరాజుపై దాడికి దిగాడు. ఇద్దర్నీ ఎంత వారించినా కొట్టుకుంటూనే వున్నారు. 
 
ఐతే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇద్దర్ని అదుపులోకి తీసుకుని శశికళను కూడా విచారించేందుకు ప్రయత్నిస్తే... అసలు వాళ్లిద్దరు తనకు కేవలం స్నేహితులు మాత్రమేనని పోలీసులకు షాకిచ్చింది. అంతేకాదు... తను పెళ్లి చేసుకోబోయేవాడు ఇతడే అంటూ మరో వ్యక్తిని సీన్లోకి తీసుకొచ్చి అతడితో వెళ్లిపోయింది. దీనితో అప్పటిదాకా ఆమె కోసం కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు కూడా నోరెళ్లబెట్టి అలా గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయారు. అదీ సంగతి.