హరికృష్ణ కుమారుడు నందమూరి జానకీ రామ్ రోడ్డు ప్రమాదంలో మృతి...
తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు, నటుడు నందమూరి హరికృష్ణ కుటుంబంలో శనివారంనాడు విషాదం చోటుచేసుకుంది. హరికృష్ణ పెద్ద కుమారుడయిన జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదకర రోడ్డు మలుపులో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో జానకిరామ్‌తోపాటు కారు డ్రైవర్ కూడా ఉన్నారు. కానీ కారును మాత్రం జానకిరామ్ నడుపుతున్నట్టు చెపుతున్నారు. కాగా కారు ప్రమాదానికి గురైన మలుపు చాలా ప్రమాదకరమైన మలుపు అనీ, ఈ మలుపులో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. నందమూరి జానకిరామ్ కారు ఈ ప్రమాదకర మలుపు వద్దకు వచ్చినప్పుడు రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ జానకిరామ్ కారును ఢీకొన్నట్లు చెపుతున్నారు.