అప్పుడు పెయింటర్... ఇపుడు డాక్టర్...శ్వేతకు చంద్రబాబు అభినందన!
ఇదంతా యాదృచ్ఛికం అయినా... ఆ యువ డాక్టర్ కు ఎంతో థ్రిల్లింగ్ అనిపించింది. అదీ... 9 ఏళ్ళు సిఎం గా పనిచేసిన చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అంటే, ఎవరికైనా గర్వంగానే ఉంటుంది.
సరిగ్గా, 25 ఏళ్ళ క్రితం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెయింటింగ్ లో మొదటి బహుమతిని తీసుకుంది... 7 సంవత్సరాల శ్వేత. అపుడు ఆయన శ్వేతను ప్రశ్నించారు. "నువ్వు భవిష్యత్తులో ఏమవ్వాలి అనుకుంటున్నావు" అని అడిగారు చంద్రబాబు. "డాక్టర్ అవుతాను" అని సమాధానం ఇచ్చింది శ్వేత. ఆనాడు తను చెప్పినట్టుగానే ఇప్పుడు డాక్టర్ శ్వేత అయ్యింది.
ఇపుడు డాక్టర్ శ్వేత చంద్రబాబును మళ్ళీ కలిశారు. తాను ఆనాడు చంద్రబాబు చేతుల మీదుగా బహుమతి తీసుకుంటున్నప్పటి ఫోటోను ఆయనకు చూపించి, "మీరే నా రోల్ మోడల్" అంటూ ఆయన ఆశీస్సులు కోరారు. సంతోషంతో ఆ ఫోటోపై చంద్రబాబు తన సంతకం చేసి ఇచ్చారు. దటీజ్ చంద్రబాబు.