సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (12:28 IST)

హైదరాబాద్‌లో నకిలీ ఎస్ఐ అరెస్టు.. వికటించిన యజమాని కారు డ్రైవర్ ఐడియా

ఓ వ్యక్తి తాను పని చేస్తున్న ఇంటికే మరో వ్యక్తి ద్వారా కన్నం వేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం నకిలీ ఎస్ఐ‌గా మారేలా ప్లాన్ వేశాడు. య‌జ‌మానిని బెదిరించి డ‌బ్బులు గుంజాల‌ని ప్ర‌య‌త్నించాడు. చివరకు తన ప్లాన్ విఫలమై ఇద్దరూ క‌ట‌క‌టాల పాల‌య్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్‌కు చెందిన ఓ డాక్ట‌ర్ వ‌ద్ద మ‌హేష్ అనే వ్య‌క్తి డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆ డాక్టర్ వద్ద గుంజేందుకు మ‌హేష్ ప‌థ‌కం ర‌చించాడు. ఖ‌మ్మం ఎస్సై అని చెప్పి డాక్ట‌ర్‌ను బెదిరించి రూ.75 డిమాండ్ చేయాల‌ని ఓ వ్య‌క్తితో ఫోన్‌లు చేయించాడు. 
 
వేధింపులు ఎక్కువ అవ్వ‌డంతో డాక్ట‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జ‌రిపి నకిలీ ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. 
 
అనంత‌రం డాక్ట‌ర్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్ మ‌హేష్ ఈ ప‌ని చేయించిన‌ట్టు గుర్తించారు. మ‌హేష్ ద‌గ్గ‌ర దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ ఉండ‌టంతో అత‌డిని వైద్యుడు విధుల నుంచి తొల‌గించారు. అనంత‌రం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.