శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (20:19 IST)

సీఎం జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ 3.0: నారా లోకేష్

ఏపీ సర్కారు మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసింది. ప్రస్తుతం చేస్తున్న రద్దు తాత్కాలిక రద్దు మాత్రమేనని పేర్కొన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ తీరుపై వైసీపీ సర్కార్ నిర్ణయాలపై మండిపడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
 
మాజీమంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తుగ్లక్ 3.0 అంటూ అభివర్ణించారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ తాజా ప్రకటనపై నిప్పులు చెరిగారు