ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (10:55 IST)

నారా లోకేష్ గుంటూరు పర్యటన: అనూష కుటుంబానికి పరామర్శ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటనకు రానున్నారు. నరసరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రానున్నారు. 
 
అనూష పుట్టినరోజును ఆమె ఇంట్లోనో, స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం టీడీపీ నేతలు దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు.
 
నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కోవిడ్‌ నిబంధనలతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. 
 
మహిళలపై జరిగే నేరాలను రాజకీయం చేయవద్దని.. రమ్య కేసు విషయంలోనూ ఇదేవిధంగా రాజకీయం చేశారన్నారు. ఫిబ్రవరిలో అనూష హత్యకు గురైతే, ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వస్తుండటం రాజకీయం కోసమేనన్నారు.