ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (18:39 IST)

నారా లోకేశ్ వద్ద ముగిసిన సీఐడీ విచారణ.. మళ్లీ రేపు రావాలంటూ నోటీసులు

lokesh nara
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వద్ద ఏపీ సీఐడీ అధికారుల తొలి రోజు విచారణ ముగిసింది. తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారని, అందులో 49 ప్రశ్నలు తనకు ఎలాంటి సంబంధం లేని ప్రశ్నలు వేశారని, 50వ ప్రశ్నగా ఐఆర్ఆర్ అలైన్మెంట్ గురించి ప్రస్తావించారని నారా లోకేశ్ మీడియాకు వెల్లడించారు. అలాగే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు రావాలని 41ఏ కింద మళ్లీ నోటీసు ఇచ్చారని, రేపు కూడా విచారణకు హాజరవుతారనని చెప్పారు. 
 
నిజానికి ఈ కేసులో ఈ నెల 4వ తేదీనే లోకేశ్‌ను సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. అయితే, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్‌ను మంగళవారం విచారణకు పిలిచారు. మొత్తం 50 ప్రశ్నలు అడిగారని చెప్పారు. మరింత సమాచారం కోసం రేపు మరోసారి విచారణకు రావాలని నారా లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని, అందువల్ల తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని చెప్పారు.