1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2023 (12:04 IST)

ఐఆర్ఆర్ కేసులు మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

narayanap
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు ఏపీ సీఐడీ పోలీసులు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఏ14గా ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కూడా విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్‌‌కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు అందజేసిన విషయం తెల్సిందే. 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా మాజీ మంత్రి నారాయణ తెలిపారు. 
 
 తాజాగా.. ఇలా నారాయణకు నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఎల్లుండి నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ ఇన్నర్ రింగురోడ్డు అక్రమ కేసులో చంద్రబాబును ఏ-01గా చేర్చింది సీఐడీ. మరి.. సీఐడీ విచారణకు నారాయణ వెళ్తారో.. లేదో..? అక్టోబర్-4న ఏం జరుగుతుందో చూడాలి మరి.